మోడీ సభకు భారీగా తరలివెళ్లిన కమలనాథులు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ గడ్డపై అడుగుపెడుతుండడంతో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల నుండి బిజెపి శ్రేణులు ఆదివారం సభకు భారీ ఎత్తునతరలివెళ్లారు. ఎంపీ డీకే అరుణ, నారాయణపేట బిజెపి జిల్లా అధ్యక్షులు సత్యయాదవ్ ఆదేశాల మేరకు ఊట్కూర్ మండలం నుండి చలో పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు ప్రత్యేకంగా కమలనాథులు బస్సుల్లో తరలి వెళ్లారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న వివిధ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళుతున్న బిజెపి నాయకులు సభకు పోటాపోటీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి భాస్కర్, మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, బిజెపి రాష్ట్ర నాయకులు ఎం విజయకుమార్, జిల్లా వాణిజ్యాసెల్ కన్వీనర్ కృష్ణయ్య గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ మండల ప్రధాన కార్యదర్శులు తారాకృష్ణ, ఆయా గ్రామాల సర్పంచ్ లు రేణుక భరత్, వాకిటి వెంకటేష్, కొల్లంపల్లి అంజయ్య,నర్సిములు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply