మొక్కలు నాటి.. భవిష్యత్‌ను కాపాడాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని బృందావన్ ఎస్టేట్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. హరిత తెలంగాణ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, లయన్స్ క్లబ్ పూర్వాధ్యక్షులు తమ్మెర విశ్వేశ్వరరావు, మాజీ కార్యదర్శి గంజి విజయపాల్ రెడ్డి, క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
