Tummala Nageswara Rao | మంత్రి తుమ్మలను కలిసిన ఆలపాటి…

దమ్మపేట , ( ఆంధ్రప్రభ ) : రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ హైదరాబాదులో శనివారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మలను ఆలపాటి అభినందించారు.
న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సులో పామాయిల్ సాగులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 నుండి ఈ సంవత్సరానికి గాను పామ్ ఆయిల్ సాగు పై అధ్యయనం చేయగా దాదాపు 40%తో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం లో ఉన్నదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ను పామాయిల్ రైతుల తరపున ఈ సందర్భంగా ఆయన తన అభినందనలు తెలిపారు.
భవిష్యత్తులో పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని లక్ష్యంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా చేపట్టవలసిన చర్యలపై మంత్రి తుమ్మల కీలక సూచనలు చేశారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలని అందుకు చేపట్టవలసిన చర్యలపై రాష్ట్ర మంత్రి తుమ్మల ఆలపాటి కి వివరించారు. ఈ సమావేశం లో ఆలపాటి తో పాటు దమ్మపేట మండల సీనియర్ నాయకులు దొడ్డా ప్రసాద్ తదితరులున్నారు.
