జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక

లక్షేట్టిపేట, ఆంధ్రప్రభః పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రమా కళ్యాణి ఆదివారం తెలిపారు. డిసెంబర్ 6, 7 తేదీలలో పెద్దపెల్లి జిల్లాలో నిర్వహించినటువంటి రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బేస్బాల్ పోటీలలో పాల్గొన్నటువంటి విద్యార్థినులు ఎం. నిహారిక, ఎల్. అక్షయ, బి. హనీ శ్రీ, కె. తేజస్విలు ప్రతిభ కనబర్చి సబ్ జూనియర్స్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని ప్రిన్సిపాల్ రమా కళ్యాణి వివరించారు. ఈనెల ఏప్రిల్ 26 నుండి 28 వరకు జరిగే సబ్ జూనియర్స్ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు.ఎంపికైన విద్యార్థినులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పిఈటి రమాదేవి, సిహెచ్ మమత, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply