జనాభా గణనలో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి
జనాభా గణనలో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి
- ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం
కడెం, ఆంధ్రప్రభ : ఈ నెల 11 నుంచి ప్రారంభమైన జనాభా గణన విధుల్లో మొబైల్ యాప్ ద్వారా వివరాలు నమోదు చేసే సమయంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు కడెం మండల తహసిల్దార్, జనాభా లెక్కల చార్జ్ అధికారి కాజా మొయినుద్దీన్‌కు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెలరోజుల పాటు సాగే జనాభా గణన విధుల్లో మొబైల్ యాప్‌లో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కాజా మొయినుద్దీన్‌ను సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్, ఎస్టీయూ మండల అధ్యక్షుడు ఎస్. బాలాజీ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, మాస్టర్ ట్రైనర్ వినోద్ కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
