హక్కులను కాలరాస్తున్న మన్నేవార్లను అడ్డుకుంటాం..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదివాసి పి వి టి జి కొలంల హక్కులను కాలరాసే విధంగా ప్రయత్నం చేస్తున్న మన్నే వార్ కులస్తులను అడ్డుకుంటామని ఆదివాసి పి వి టి జి ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి ఆత్రం ముకుందరావు, రాష్ట్ర సలహాదారులు మాణిక్ రావు అన్నారు. వారు నాయకులతో కలిసి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రెస్ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ తమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భీమ్రావు వ్యవస్థాపక అధ్యక్షులు కుడిమేత తిరుపతి ఆదేశాల మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ.. మన్నెవార్లు కొంతకాలంగా కొలం, తోటి తెగలపై దుష్ప్రచారం చేస్తూ తమ తెగల సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీస్తున్నారని వారన్నారు.
ఈ మధ్యకాలంలో మన్యవాదులుగా ఉన్నవారు కోలాం లుగా చలామణి అవుతూ ఐటిడిఏ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తమ భాష వాడుతూ తమకు అన్యాయం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో కొలం, తోటి,చెంచు, కొండరెడ్లు ఈ నాలుగు కులాలు ఎక్కడైనా పివిటి జి లుగా గుర్తించబడతారని వారు పేర్కొన్నారు. మన్నేవార్లు తమ తెగలలో లేరని, తమ తెగలకు అన్యాయం చేస్తే సహించేది లేదని వారు పేర్కొన్నారు. ఇలాగే వ్యవహరిస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధర్నా రాష్ట్ర రూపంలో ముట్టడి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ వి లేఖర్ల సమావేశంలో సంఘ నాయకులు టేకం మారుతి, టేకెన్ దేవరావులు పాల్గొన్నారు.
