ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం

చిట్యాల, ఆంధ్రప్రభ : పేద యువతికి ఎమ్మెల్యే చేయూత – 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం చిట్యాల పట్టణంలో పేద కుటుంబానికి చెందిన యువతికి వివాహ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం అందజేశారు. కాంగ్రెస్ కార్యకర్త ఎండి గౌస్ కుమార్తె పెళ్లికి రూ.10,000 సహాయాన్ని మంజూరు చేశారు. ఈ సహాయాన్ని 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ చేతుల మీదుగా అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక స్థాయిలో ప్రజల సమస్యలకు దగ్గరగా ఉంటూ సేవలు అందిస్తున్న కౌన్సిలర్ కుక్కల మోహన్ పాత్రను ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఏర్పుల పరమేష్, బొబ్బల రామ్ రెడ్డి, జిట్టా రవి, ఎస్.కే ఇబ్రహీం, ఎస్.కే ముబీన్, రుద్రవరం లింగస్వామి, ఇమ్రాన్, ఎస్.కే ఫరీద్ తదితరులు పాల్గొని ఎమ్మెల్యే చేసిన సహాయాన్ని అభినందించారు.

Leave a Reply