IPL2026 | గుజరాత్ టార్గెట్‌159

IPL2026 | గుజరాత్ టార్గెట్‌159

IPL2026 | ఆంధ్ర‌ప్ర‌భ‌,వెబ్ డెస్క్ః గుజరాత్ టైటాన్స్ (GT) తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో CSK 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఒక దశలో కేవలం 37 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును రుతురాజ్ తన బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. బాధ్యతాయుతంగా ఆడుతూ 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బౌండరీలతో విరుచుకుపడి, చివరికి 60 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. GT బౌలర్లలో కగిసో రబాడ 3 వికెట్లు పడగొట్టగా.. అర్షద్ 2, సిరాజ్, సుతార్ తలో వికెట్ తీశారు.

Leave a Reply