133rd-episode |న్యూక్లియ‌ర్ ప్రోగ్రామ్‌లో ముంద‌డుగు

133rd-episode | న్యూక్లియ‌ర్ ప్రోగ్రామ్‌లో ముంద‌డుగు

సైన్స్ అండ్ టెక్నాల‌జీలో ఇండియా టాప్‌
క‌ల్ప‌కం ఫాస్ట్ బ్రీడ‌ర్ రియాక్ట‌ర్ ప‌నితీరు బాగుంది
క్రిటికాలిటి ద‌శ దాట‌డం సంతోషం
దీనివ‌ల్ల ఇంధ‌న ఖ‌ర్చు త‌గ్గుతుంది
ప్ర‌పంచ దేశాల్లో ఇలాంటి టెక్నాల‌జీ చాలా త‌క్కువ‌
విండ్ ప‌వ‌ర్ ప‌రంగానూ పురోగ‌తి సాధిస్తున్నాం
ఈశాన్య రాష్ట్రాల్లో వెదురు చెట్ల పెంప‌కంతో ఉపాధి
133వ మ‌న్‌కీ బాత్‌లో ప్ర‌ధాని మోదీ

133rd-episode | న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆదివారం మన్‌కీ బాత్ 133వ ఎపిసోడ్‌‌ని ఆల్ ఇండియా రేడియోలో నిర్వహించారు. తన మనసులో ఆలోచనలు, భావాల్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన ఏమన్నారంటే.. “అందరికీ మన్ కీ బాత్ కి స్వాగతం. భారత సైన్స్ అండ్ టెక్నాలజీ జోరుగా ఉంది. దేశ సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లో సైంటిస్టులు ముందడుగు వేస్తున్నారు. వారి ప్రయత్నాలతో ఈ కార్యక్రమం బాగా సాగుతోంది. ఇది మన పరిశ్రమలు, ఆరోగ్యరంగం, ఎనర్జీ రంగాలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తోంది” అని మోదీ తెలిపారు. ఇక‌.. తమిళనాడులోని కల్పకం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌.. క్రిటికాలిటీ దశను దాటడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీని వల్ల అయ్యే ఇంధన ఖర్చు కంటే.. ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చు. ఇలాంటి టెక్నాలజీ ప్రపంచంలో చాలా చాలా తక్కువ దేశాల్లో ఉంది. ఇప్పుడు ఈ రియాక్టర్ తనకు కావాల్సిన ఇంధనాన్ని తానే ఉత్పత్తి చేసుకోగలదు. అదనంగా కూడా ఉత్పత్తి చెయ్యగలదు.

133rd-episode | విండ్ ప‌వ‌ర్ అదృశ్య శక్తి..

దేశంలో విండ్ ఎనర్జీ (పవన శక్తి) అనేది సరికొత్త రూపు తీసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. ఇప్పుడు ఇండియాలో విండ్ ఎనర్జీ సంవత్సరానికి 56 గిగావాట్లను మించిందని మోదీ తెలిపారు. ప్రపంచం మనవైపు చూస్తోందని మోదీ అన్నారు. విండ్ ఎనర్జీలో ఇప్పుడు భారత్ 4వ స్థానంలో ఉందనీ, ఇది ఇంజినీర్ల గొప్పదనం అని మోదీ మెచ్చుకున్నారు. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇలా దేశంలో అనేక రాష్ట్రాల్లో విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అభివృద్ధి జరుగుతోందని మోదీ అన్నారు. ఇది భారత్‌కి అత్యవసరం అని కోరారు. క్లీన్ ఎనర్జీ దిశగా మన అడుగులు పడాలన్నారు.

133rd-episode | బుద్ధ పూర్ణిమ శుభాకాంక్ష‌లు..

త్వరలో రాబోతున్న బుద్ధ పూర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ.. శాంతి అనేది మన మనసు నుంచే మొదలవుతుందని బుద్ధుడు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మనపై మనం సాధించే విజయం.. గొప్ప విజయం అని బుద్ధుడు చెప్పారని తెలిపారు.

ప్రకృతి సంరక్షణ..
గుజరాత్.. కచ్ ప్రాంతంలో వర్షాకాలం తర్వాత ఏటా లక్షల ఫ్లెమింగో పక్షులు వస్తాయనీ.. మొత్తం గులాబీ రంగుతో నిండిపోతుందని మోదీ తెలిపారు. అందుకే ఆ ప్రాంతాన్ని గులాబీ సిటీ అంటారని వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో జూన్ తర్వాత.. ఏనుగుల బెడద పెరుగుతుంటే.. అక్కడ గజ మిత్ర కార్యక్రమం ప్రారంభమైందని మోదీ తెలిపారు. దీన్లో భాగంగా.. గ్రామంలో స్థానికులు ఏనుగులపై ఫోకస్ పెట్టారనీ, ఏనుగుల గురించి స్థానికులకు అవగాహన పెంచారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో బ్లాక్ బక్ జింకల సంఖ్య బాగా పెరిగిందనీ.. అలాగే.. రాజస్థాన్ లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షుల సంఖ్య పెరిగిందనీ.. మోదీ వివరించారు. ఇలా పక్షుల సంఖ్య పెంచే చర్యలు తీసుకుంటున్నారని మోదీ తెలిపారు.

ఈశాన్య రాష్ట్రాల్లో వెదురు విప్లవం..
ఈశాన్య భారత్‌లో బాంబూ చెట్ల పెంపకం బాగా పెరిగిందనీ.. వెదురు కళాఖండాలతో చాలా మంది ఉపాధి పొందుతున్నారనీ మోదీ తెలిపారు. 2017లో కేంద్రం.. వెదురును చెట్ల కేటగిరీ నుంచి కేంద్రం తొలగించింది. ఫలితంగా వెదురును పెంచవచ్చు, కట్ చెయ్యవచ్చు. అందువల్ల ఈశాన్యంలో వెదురు విప్లవం మొదలైందని మోదీ తెలిపారు. డ్వాక్రా సంఘాలు కూడా వెదురుతో రకరకాల ఆహార పదార్థాలను తయారుచేస్తున్నారని మోదీ వివరించారు.

CLICK HERE TO READ MORE : ఇరాన్‌లో.. ఆర్థిక సంక్షోభం !

CLICK HERE TO READ MORE :

Leave a Reply