మైనర్ బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్

మైనర్ బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్

జిల్లా చైల్డ్ కేర్ సెంటర్ కు వచ్చిన పిర్యాదుతో హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్ లో కేస్ నమోదు

హుజూర్‌నగర్ మే 20 (ఆంధ్రప్రభ) మైనర్ బాలికను వివాహం చేసుకున్న ట్రాపిక్ కానిస్టేబుల్ పై హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్ లో కేస్ నమోదు. ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల మేరకు హుజూర్‌నగర్ పట్టణంలోని సీతారామనగర్ కాలనీ కి చెందిన నాయిని అనిల్ కుమార్ గౌడ్ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ట్రాపిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మే 9 తెల్లవారు ఝామున 2:17 గంటలకు అనంతగిరి మండలం పాలారం గ్రామానికి చెందిన మైనర్ బాలిక తో వివాహం జరిగినట్లు సూర్యాపేట జిల్లా చైల్డ్ కేర్ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు హుజూర్‌నగర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ సోమమ్మ మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన పిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.