పద్మజ్యోతి యువజన సంఘం అధ్యక్షుడిగా బడుగు కైలాసం

పద్మజ్యోతి యువజన సంఘం అధ్యక్షుడిగా బడుగు కైలాసం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామ పద్మజ్యోతి యువజన సంఘం నూతన కమిటీని ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం నూతన అధ్యక్షుడిగా బడుగు కైలాసం ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రచ్చ వెంకటేశం, కార్యదర్శిగా వర్కాల రాజు, కోశాధికారిగా వనం సురేందర్, క్రీడల కార్యదర్శిగా పొట్టబత్తిని ఆనంద్, సాంస్కృతిక కార్యదర్శిగా జెల్ల ఆనంద్, గ్రంథాలయ కార్యదర్శిగా కుడికాల శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా బీమనపల్లి శేఖర్, కైరంకొండ పాండు, బోనగిరి శ్రీనాథ్, గడ్డం గిరీష్, వడ్డేపల్లి సతీష్, సూరెపల్లి సంతోష్ నియామకమయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కైరంకొండ స్వప్న అశోక్, మాజీ సర్పంచులు గడ్డం నర్సింహ, మాచర్ల కృష్ణ, సంఘ సభ్యులు పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
