Sushmita Dev | రాజీనామాపై స్పందించిన సుస్మితా దేవ్
Sushmita Dev | రాజీనామాపై స్పందించిన సుస్మితా దేవ్
Sushmita Dev | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : రాజ్యసభ సభ్యత్వంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సుస్మితా దేవ్ తన నిర్ణయంపై స్పందించారు. వ్యక్తిగత, రాజకీయ కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. దేశంలో ఎవరికైనా తమ ఆలోచనలను మార్చుకునే హక్కు ఉందని వ్యాఖ్యానించారు.
టీఎంసీని ఎందుకు వీడాల్సి వచ్చిందన్నది పెద్ద కథ అని, రాజకీయాల్లో ప్రతి విషయాన్ని బయటకు చెప్పాల్సిన అవసరం లేదని సుస్మితా దేవ్ పేర్కొన్నారు. “నేను టీఎంసీ నుంచి బయటకు వచ్చాను. ఒకేసారి రెండు పడవలపై కాలు వేసి ఉండే పరిస్థితిలో ఉండటం నాకు ఇష్టం లేదు. మమతా దీదీ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయను” అని ఆమె చెప్పినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి.
తన రాజీనామా పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని సుస్మితా దేవ్ స్పష్టం చేశారు. తాను ఒక పార్టీలో కొనసాగుతూ మరో దిశగా పనిచేసే రాజకీయాన్ని ఎప్పుడూ అనుసరించలేదని అన్నారు. ప్రస్తుతానికి తన తదుపరి రాజకీయ అడుగు గురించి మరింతగా చెప్పలేనని తెలిపారు.
