తుఫాన్ బాధితులను ఆదుకోవాలి..

తుఫాన్ బాధితులను ఆదుకోవాలి..

తొర్రూరు, (ఆంధ్రప్రభ):
మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగా రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని అమ్మాపురం శివారులో మొంథా తుఫాన్ తో నేలకొరిగిన వరి పంటలను స్థానిక బిజెపి నాయకులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట ప్రకృతి వైపరిత్యం కారణంగా నీటి పాలు అయిందని, దీంతో రైతులకు కోలుకోలేని విధంగా నష్టం జరిగిందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.