పట్టపగలే వీధి దీపాలు..

పట్టపగలే వీధి దీపాలు..

  • పగలే వెన్నెలాయే..!!
  • పట్టించుకుని అధికారులు..!

వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ ప్రాంతంలో బుధవారం రోజున పట్టపగలే వీధి దీపాలు వెలుగుతుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అమీనాపూర్ ఎస్సి కాలనీలో గాంధీ విగ్రహం సమీపంలోని కరెంట్ పోల్‌పై అమర్చిన వీధి దీపం పగటి సమయంలోనూ వెలుగుతుండగా,వీధి దీపం వెలుగుతుండటం గమనార్హం. విద్యుత్ ఆదాపై ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో,పగటి వేళల్లోనే వీధి దీపాలు వెలుగుతుండటం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు,గ్రామ పంచాయతీ సిబ్బంది వీధి దీపాల నిర్వహణను పర్యవేక్షించి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.