అసాంఘిక కార్యక్రమాలకు అండగా నిలిస్తే కఠిన చర్యలు తప్పవు…..
అసాంఘిక కార్యక్రమాలకు అండగా నిలిస్తే కఠిన చర్యలు తప్పవు…..
మామిడి తోటల నిర్వాహకులు తప్పక పోలీసువారి సూచనలు పాటించాలి……. సీఐ వెంకటేశ్వర్లు
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : అసాంఘిక కార్యక్రమాలకు అండగా నిలిచిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆదివారం ఆయన మునేటి అవతల నున్న మామిడి తోటలను తనిఖీలు నిర్వహించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు అమ్మవారి దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాలన్నీ పలు జిల్లాల నుండి పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటుంటారు అమ్మవారి దర్శనం అనంతరం మునేటి అవతల నున్న మామిడి తోటలలో భక్తులు తమ బంధు వర్గానికి విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిని ఆసరాగా చేసుకొని కొందరు మామిడి తోట యజమానులు తమ మామిడి తోటలను కొందరు ప్రైవేటు వ్యక్తులకు లక్షల రూపాయల అద్దెకు ఇస్తుంటారు.
మామిడి తోటలను అద్దెకు తీసుకున్న వ్యాపారులు తమ తోట లోకి వచ్చిన భక్తుల నుండి ఇష్టానుసారంగా అధిక ధరలకు భక్తులకు అవసరమైన సామాగ్రిని అద్దెకి ఇచ్చి వంటలకు వినియోగించు వంట సామాగ్రిని అధిక ధరలకు విక్రయిస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు అని వస్తున్న ఆరోపణల పై నందిగామ ఏసిపి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సిఐ వెంకటేశ్వర్లు స్థానిక ఎస్సై అర్జున్ తో కలిసి మునేటి అవతల నున్న సుమారు 15 మామిడి తోటలో వారు పరిశీలించి నిర్వాహకులకు యజమానులకు పలు సూచనలు చేశారు.
కొత్త నిబంధన ప్రతి ఒక్కరు ఆచరించాలి…… సిఐ వెంకటేశ్వర్లు
మామిడి తోటలోని ఏసీ రూములు అద్దెకు తీసుకున్న వారి వద్ద నుండి ఎటువంటి వివరాలు సేకరించకుండా ఇష్టానుసారంగా గదులు అద్దెకు ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా తీసుకోకపోయినా వారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని మామిడి తోటలోకి వచ్చే ప్రతి ఒక్కరి వద్ద నుండి పూర్తి వివరాలు తీసుకోవాలని అలాగే ప్రతి తోటలో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యంగా మద్యం సేవించే వారిపై ప్రత్యేక దృష్టి సారించి స్థానిక పోలీసులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అన్నారు. మామిడి తోటలో రాత్రి సమయాలలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి రూములు అద్దెకివ్వొద్దని అధిక ధరలు వస్తున్నాయని ఆశతో ఎవరైనా గదులు అద్దెకిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
పుణ్యక్షేత్ర పవిత్రతను చెడగొడితే రౌడీ షీట్ తెరుస్తాం…. ఎస్సై అర్జున్
ఆలయ పరిసరాల్లో మద్యం విక్రయాలు , పేకాట కనిపిస్తే సహించేది లేదు. 24 గంటలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని. సీసీ కెమెరాలు, మఫ్టీలో పోలీసులతో నిఘా ఏర్పాటుచేసి అనుమానితులను అరెస్ట్ చేసి, రౌడీషీట్ ఓపెన్ చేస్తాం. పుణ్యక్షేత్ర పవిత్రతను చెడగొడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులతో కలిసి తోటల్లో తనిఖీలు చేపడతామని, అసాంఘిక శక్తులను ఉపేక్షించబోమని పెనుగంచిప్రోలు ఎస్పై అర్జున్ స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నేరుగా తనకు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. తిరుపతమ్మ తల్లి దేవస్ధానంపై సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు అని ఎస్పై అర్జున్ హెచ్చరించారు.
