Bhogapuram | ఆగస్టు 17 నుంచి విమానాల సందడి

  • ఎయిర్ ఇండియా విమానాల షెడ్యూల్ విడుదల
  • ఆగస్టు 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం..
  • అక్టోబర్ 24 వరకు షెడ్యూల్ ప్రకటించిన సంస్థ
  • హైదరాబాద్‌కు రోజుకు 5, బెంగళూరుకు 2–3, విజయవాడకు 4 సర్వీసులు

భోగాపురం, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడిచే విమానాల షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా సంస్థ విడుదల చేసింది. ఆగస్టు 17 నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి రెగ్యులర్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండే షెడ్యూల్‌ను సంస్థ ప్రకటించింది.

షెడ్యూల్ ప్రకారం.. హైదరాబాద్–భోగాపురం మధ్య రోజుకు ఐదు విమాన సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అలాగే బెంగళూరు–భోగాపురం మార్గంలో రోజుకు రెండు సర్వీసులు ఉండనున్నాయి. అదనంగా ఆదివారం, శుక్రవారం మినహా మిగిలిన ఐదు రోజుల్లో మూడో సర్వీసు కూడా నడపనున్నట్లు వెల్లడించింది.

అలాగే విజయవాడ–భోగాపురం మధ్య రోజుకు నాలుగు విమాన సర్వీసులు నిర్వహించనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. విమానాశ్రయం ప్రారంభం అనంతరం రెగ్యులర్ విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోని ప్రధాన నగరాలతో వైమానిక అనుసంధానం మరింత బలోపేతం కానుందని అధికారులు భావిస్తున్నారు.