జగన్మాతను దర్శించుకున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బుధవారం ఆలయానికి విచ్చేసిన ఆయనకు దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. బ్రహ్మం చౌదరి కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదును అందజేశారు