పిసిసి కార్యదర్శిని పరామర్శించిన ఎంపీ..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ని ఆదివారం జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షట్కర్ పరామర్శించారు. ఇటీవల ఇంద్రకరణ్ రెడ్డి మోకాళ్ళ శాస్త్ర చికిత్సలు చేయించుకొని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంకంరాజు పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
