Scholarship Motivation | రష్మిక అసలే కాదు : విజయ్ దేవ‌ర‌కొండ‌

Scholarship Motivation | రష్మిక అసలే కాదు : విజయ్ దేవ‌ర‌కొండ‌

స్కాలర్‌షిప్ కార్యక్రమంలో విజ‌య్‌, ర‌ష్మిక ప్ర‌సంగం
ర్యాంకులే విజయానికి కొలమానం కాదన్న విజయ్ దేవరకొండ
గెలుపు-ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోవాలని విద్యార్థులకు రష్మిక సూచన

Scholarship Motivation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాలు అందించారు. చదువులో ర్యాంకులు మాత్రమే జీవిత విజయాన్ని నిర్ణయించవని, ఆత్మవిశ్వాసం, కృషి, నేర్చుకునే తత్వం ముఖ్యమని పేర్కొన్నారు.

సినీ నటులు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో అచ్చంపేటలో మెరిట్ స్కాలర్‌షిప్ అవార్డీస్ 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 20 ప్రభుత్వ పాఠశాలలలో 9వ మరియు 10వ తరగతుల్లో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించి స్కాలర్‌షిప్‌లను అందజేశారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ ఫస్ట్ లేదా సెకండ్ ర్యాంకర్ కాదని, అయినప్పటికీ జీవితంలో లక్ష్యాలను చేరుకోవచ్చని చెప్పారు. విద్యార్థులు మార్కుల కంటే తమ ప్రతిభ, సామర్థ్యాలపై విశ్వాసం పెంచుకోవాలని సూచించారు.

Scholarship Motivation

రష్మిక మందన్న మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి సందర్భం ఒక పాఠమని చెప్పారు. “కొన్నిసార్లు గెలుస్తాం.. మరికొన్నిసార్లు ఓడిపోతాం.. కానీ ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకుంటాం” అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి మంచి విషయాలు నేర్చుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.

Scholarship Motivation

విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా ముఖ్యమని, కష్టపడే వారికి విజయాలు తప్పక దక్కుతాయని ఇద్దరూ విద్యార్థులకు ప్రోత్సాహాన్నిచ్చారు. వారి సందేశాలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాయి.