అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు..

అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు..
గుండాల/ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : గుండాల మండల పరిధిలోని రోళ్లగడ్డ తండాలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ భూక్యామంగమ్మ, శ్రీనుతో పాటు 100 కుటుంబాలు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల సమక్షంలో చేరడం జరిగిందని భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పొంబోయిన ముత్తయ్య, జిల్లా కార్యదర్శి షేక్ ఖదీర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలకు పీనపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ కండువా కప్పి సావధానంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీలో చేరిన సర్పంచ్ మంగమ్మ శ్రీను మాట్లాడుతూ.. నియోజకవర్గం వ్యాప్తంగా విరివిరిగా జరుగుతున్న జరగబోయే పలు అభివృద్ధి, సంక్షేమ రంగాలలో భాగస్వామ్యం అయ్యేందుకు తొలి అడుగులు వేస్తూ నేడు కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై రోల్లగడ్డ పంచాయతీని అన్నివిధాలా అభివృద్ధి పర్చుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుసరిస్తున్న ద్వంద వైఖరితోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆదివాసీ ముద్దు బిడ్డ పినపాక నియోజకవర్గం పాయం వెంకటేశ్వర్లు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పొంబోయిన ముత్తయ్య, జిల్లా కార్యదర్శి షేక్ ఖదీర్, ఏఎంసి డైరెక్టర్ ఊకే బుచ్చయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దార అశోక్, పడుగోనిగూడెం సర్పంచ్ ఈసం సంజీవరావు, వసంతరావు, కల్తీ కృష్ణారావు, మండల నాయకులు షేక్ అబ్దుల్ నభి, మోకాళ్ళ శంకర్, పాయం గణేష్, వాంకుడోత్ బీకోజీ, సనప సీతారాములు, వాజీద్ పాషా, కాసీం, ఇస్రార్, పల్లపు రాజేష్, బొంగు చంద్రశేఖర్, నూనావత్ రవి, బొర్ర వెంకటేశ్వర్లు, గుర్రం పుష్పరాజ్, గడ్డం రాజేష్, సోషల్ మీడియా కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
