వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

సీతారాముల విగ్రహాలను పాత బస్టాండ్ సమీపంలోని హనుమాన్ మందిరం నుంచి రామాలయం వరకు భక్తుల మధ్య శోభాయాత్రగా తీసుకువచ్చారు. రామాలయ పురోహితుడు సంతోష్ ధూబే పండితుల చేతుల మీదుగా కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.

వేడుకలకు హాజరైన వందలాది భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. భక్తులు తమకు తోచినంతగా కానుకలు సమర్పించారు. వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్, ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితిష్ రాథోడ్, అదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఉట్నూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్ తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు.

అలాగే బీజేపీ ఉట్నూర్ మండల అధ్యక్షుడు బింగి వెంకటేష్, రామాలయ కమిటీ అధ్యక్షుడు పాత రవీందర్, హిందూ ఉత్సవ సమితి నాయకులు షికారి శ్రీనివాస్, సాడిగే రాజగోపాల్, అరికిల్ల అశోక్, కేశవ్ తదితరులు, వివిధ పార్టీల నాయకులు, ఉద్యోగులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.