కడెంలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ వర్ధంతి
కడెం, ఆంధ్రప్రభ: కడెం మండల కేంద్రంలో ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ కడెం మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాథోడ్ రమేష్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి, నియోజకవర్గ ప్రగతికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు పి. శ్రీరామ్, రాపర్తి శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జక్కుల సత్తన్న, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ మోహన్ నాయక్, మండల నాయకులు ఎన్. ప్రసాద్, ములికి కృష్ణ, పాలకుర్తి నగేష్, జి. ప్రసాద్, డి. తిరుమలయ్య, జి. వేణుగోపాల్, గట్ల నల్లగొండ, సకినాల ప్రవీణ్, ఎనగందుల భూమన్న, బైరి రమేష్, బాలు, లక్ష్మణ్, పార్టీ కార్యకర్తలు మరియు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
