utnoor నరేంద్ర మోడీ పాలనలో సురక్షిత పాలన..
utnoor నరేంద్ర మోడీ పాలనలో సురక్షిత పాలన..
- చిత్రలేఖన పోటీలు నిర్వహణ
ఉట్నూర్ (utnoor), ఆంధ్రప్రభ: భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో దేశ ప్రజలకు సురక్షిత పాలన అందించి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుమన్ రాథోడ్ అన్నారు.
సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని శ్రీ పూలాజి బాబా పాఠశాలలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సేవా కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ విద్యార్థులకు పాలనపై దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమాన్ని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి అర్క పుష్పలత, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి శారద ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
