కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి
- 10వ తేదీ లోపు ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం
- లారీల హమాలీల కొరతతో కొంత ఆలస్యం
- ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం
- రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టం
- భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
వలిగొండ, ఆంధ్రప్రభ ; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌరసరిఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిల పర్యవేక్షణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, నియోజకవర్గంలో అత్యధికంగా వరి ధాన్యం పండిందని, ఈనెల 10వ తేదీ లోపు కొనుగోలు కేంద్రాలలో గింజ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని టేకుల సోమవారం వద్ద పూసల గోదామును ఎమ్మెల్యే అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డిఎస్ఓ రోజా రమని, సివిల్ సప్లై డిఎం హరికృష్ణ భువనగిరి ఆర్డిఓ కృష్ణారెడ్డి తో ధాన్యం కొనుగోలు తీరుపై వారిని అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి కారణం ఏమిటి అని వారిని ప్రశ్నించారు. మిల్లులో ధాన్యం నిల్వలు నిండిపోవడంతో ప్రత్యేకంగా తిరుమలగిరిలో ఆరు లక్షల బస్తాలకు,కోదాడలో మూడు లక్షలకు, టేకుల సోమవారం లోని పూసల గోదాంలో లక్షన్నర బస్తాలధాన్యం నిల్వలకు గోదాములను నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం తరలించడం జరుగుతుందన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో సహకారంతో 30 వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ బియ్యం కు అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు.దీంతో మిల్లు యజమానులు ధాన్యం త్వరితగతన దింపుకోవడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని,రైతుల పక్షపాతి అని అన్నారు.
రైతులు ఎలాంటి ఆందోళన ఆవేదన చెందవద్దని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు. హమాలీల కొరతతో కూడా కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెసే అని అన్నారు. టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావులు తప్పుడు ప్రకటనలు మానుకోవాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కట్టి పరిస్థితిలో మీటర్లు పెట్టమని ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందన్నారు.
రైతులు ఎలాంటి అపోహలకు గురి కా వద్దన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దశరథ నాయక్, వలిగొండ భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్లు భీమ నాయక్, రేఖ బాబురావు, మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు వాకిటి అనంతరెడ్డి, తుమ్మల యుగంధర్ రెడ్డి, వలిగొండ సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, గరిసె రవి, పాశం సత్తిరెడ్డి, బత్తిని లింగయ్య చెరుకు శివయ్య గౌడ్, బత్తిని సహదేవ్ కొండూరు సాయి, జక్క జంగారెడ్డి, పలసం సతీష్ గౌడ్, గంగాపురం సతీష్ గౌడ్,నరేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి,సతీష్ రేఖల ప్రభాకర్, బత్తిని అరుణ్ వలిగొండ భువనగిరి మండలాల కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు.
