కురిసిన వడగళ్ల వాన… రైతుకు కన్నీటి ధార..

కురిసిన వడగళ్ల వాన… రైతుకు కన్నీటి ధార..

చందూర్, ఆంధ్ర‌ప్ర‌భ : చందూర్ మండలంలో చందూర్, కరేగాం తాండ, మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామాలలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో కురిసిన వడగళ్ల వర్షానికి రైతన్నకు భారీ నష్టాన్ని చేకూర్చింది.

ఇంకో పది పదిహేను రోజుల్లో చేతికి వచ్చే వరి పంట నేల రాలిపోయి రైతన్నకు కన్నీరు మిగిల్చింది. పంట పెట్టుబడి సొమ్ము కూడా రాదని దిగులు చెందుతున్నారు. ప్రభుత్వం రైతులని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply