బీజేపీ లేబర్ సెల్ జిల్లా కో-కన్వీనర్ నరేందర్ గౌడ్‌కు ఘన సన్మానం

నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని నాయకుల ఆకాంక్ష

మునుగోడు, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం (లేబర్ సెల్) నల్లగొండ జిల్లా కో-కన్వీనర్‌గా నియమితులైన మాదగోని నరేందర్ గౌడ్‌తో పాటు కార్యవర్గ సభ్యుడు కంభంపాటి నర్సింహను మునుగోడు మండల బీజేపీ అధ్యక్షుడు పెంబళ్ల జానయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి మండల పార్టీ ప్రభారి చిన వెంకట నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ ఉపాధ్యక్షుడు కర్నాటి శేఖర్, సీనియర్ నాయకులు నీరుడు రాజారాం, కర్నాటి లింగయ్య, మండల ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి సతీష్, మల్లేష్, పోలే వెంకటేశ్వర్లు, రవి, దేశిడి వెంకన్న, వేముల శ్రీరంగం, నరేందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.