ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పాఠశాలలో జాతీయ జెండాను ఎగరవేశారు. రెవిన్యూ కార్యాలయంలో తాసిల్దార్ ప్రసాద్ రావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో విజయ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో పులి రమేష్, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ నరసింహారావు, మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ వైస్ చైర్మన్ బొక్క స్రవంతి, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మునిగడప లావణ్య, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ చదువుల సత్యనారాయణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్, జంక్షన్ వద్ద బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్ బిజెపి మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకున్నారు. మండల వ్యాప్తంగా జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొడిశాల రాజన్న గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ఉప సర్పంచ్ గోడిశాల రాజు, సొసైటీ వైస్ చైర్మన్ శేషగిరి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకుడు గోడిశాల అర్జున్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు గోడిశాల వినయ్ గౌడ్, సీఏ కవిత, గ్రామపంచాయతీ కార్యదర్శులు వార్డ్ మెంబర్లు, కారోబార్ లు లక్ష్మణ్, అంగన్వాడి టీచర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.