మలేరియా నివారణ కోసం జాగ్రత్తలు పాటించాలి

మలేరియా నివారణ కోసం జాగ్రత్తలు పాటించాలి

  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సి.హెచ్.మధుసూదన్

చిట్యాల, ఆంధ్రప్రభ ; ప్రజలు మలేరియా బారిన పడకుండా ముందస్తు తగు జాగ్రత్తలు తీసుకోవాలని,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సి.హెచ్. మధుసూదన్ కోరారు. శనివారం ఒడితల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం భాగంగా, ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం, సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సి.హెచ్. మధుసూదన్ , మలేరియా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సందీప్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రజలకు మలేరియా వ్యాధి నివారణపై కీలక సూచనలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలేరియా వ్యాధి ఆడ ఎనాఫిలిస్ దోమ కాటు వల్ల వస్తుందని తెలిపారు. తీవ్రమైన జ్వరం, చలి వణుకులు వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. సరైన సమయంలో పరీక్షలు చేయించుకుంటే మలేరియాను పూర్తిగా నయం చేయవచ్చని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందుబాటులో ఉందని వివరించారు.

మలేరియా నివారణ కోసం ప్రజలు తమ పరిసరాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమల పెరుగుదలను అరికట్టాలని సూచించారు. దోమతెరలు ఉపయోగించడం, ప్రతి మంగళవారం శుక్రవారం “డ్రై డే” పాటించడం ద్వారా దోమల నియంత్రణ సాధ్యమని పేర్కొన్నారు.

జ్వరం వచ్చిన వెంటనే ఆశా కార్యకర్తలు లేదా ఆరోగ్య సిబ్బందిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఒడితల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మౌనిక , జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి సుధాకర్ , జిల్లా అకడమిక్ రమేష్ , సబ్ యూనిట్ అధికారులు హలీం , ఇతర వైద్య సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు , జిల్లా ఎపిడమిక్ టీం సభ్యులు, పాల్గొన్నారు.

Leave a Reply