ఉప్లూర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట..

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఎనుగందుల శైలేందర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఎనుగందుల శైలేందర్ మాట్లాడుతూ.. గ్రామంలోని పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ రాజన్న, ఉపాధ్యాయులు, వార్డు సభ్యుడు సురేష్, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.