ఘనంగా డిసిసి కార్యదర్శి జన్మదిన వేడుకలు..
బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మహమ్మద్ యూనుస్ జన్మదిన వేడుకలను కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం ఆదర్శ పాఠశాల విద్యార్థులకు స్వీట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు చాట్ల నరేష్, పట్టణ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, యూత్ కాంగ్రేస్ ఉపాధ్యక్షుడు వివేక్, నాయకులు కుందారం శ్రీనివాస్, మహమ్మద్ అన్వర్, గడ్డం రవి, సంతోష్ గౌడ్, హరికృష్ణ, ఎమ్మెస్ గౌడ్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస ప్రసాద్,ఉపాధ్యాయ బృందం తదితర కాంగ్రేస్ నాయకులు పాల్గొన్నారు.
