ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

కడెం, ఆంధ్రప్రభ: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని నర్సాపూర్ గ్రామ సర్పంచ్ డీఎస్ సంగీత రాజేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం కడెం మండలంలోని నర్సాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని పాఠశాల ఆవరణలో పలు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు, గ్రామస్థులకు మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని వివరించారు.

మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం వనిత, ఉపాధ్యాయుడు సాయి కిరణ్, పంచాయతీ కార్యదర్శి నరేష్, అంగన్‌వాడీ టీచర్ భూపేందర్ కౌర్, ఈజీఎస్ ఎఫ్‌ఏ జెట్టి రాజు, నాయకులు జనార్ధన్, పాఠశాల పోషకులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.