సబ్సిడీపై జీలుగ విత్తనాల అందజేత

సబ్సిడీపై జీలుగ విత్తనాల అందజేత

భీమ్‌గల్ రూరల్ ,ఆంధ్రప్రభ:

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకు సబ్సిడీ పై జీలుగా విత్తనాలు అందజేయడం జరుగుతుందని ముచ్కూర్ సొసైటీ అధ్యక్షులు బంగ్లా దేవేందర్ అన్నారు. గురువారం ముచ్కూర్ సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు 50 శాతం సబ్సిడీ పై జీలుగ ( పచ్చి రొట్ట ) విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కొరకు ప్రవేశ పెడుతున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ ప్రెసిడెంట్ బురెడీ గంగారెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply