ఉడుంపూర్ వద్ద రోడ్డు ప్రమాదం..

ఉడుంపూర్ వద్ద రోడ్డు ప్రమాదం..

కడెం, ఆంధ్ర‌ప్ర‌భ : ఉడుంపూర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు హనుమండ్ల కొమురయ్య వయసు: 68 సంవత్సరాలు, స్వగ్రామం లక్షెట్టిపేట్, మంచిర్యాల జిల్లా.

ఈ నెల 9న సాయంత్రం కొమురయ్య కడెంలోని కూతురు ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో సిరికొండ మండలం వాయిపేటలోని గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఉడుంపూర్ సమీపంలోని గండి మైసమ్మ టెంపుల్ దగ్గర ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

తీవ్రంగా గాయపడిన కొమురయ్యను లక్షెట్టిపేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆటోలో ఉన్న మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుని కొడుకు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కడెం PS SI పి. సాయికిరణ్ తెలిపారు.

Leave a Reply