పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన నివాళి
భూత్పూర్‌లో బీఆర్ఎస్ నాయకుల శ్రద్ధాంజలి
భూత్పూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమ వీరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి భూత్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బస్వరాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అవిశ్రాంతంగా పోరాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు.
ఈ సందర్భంగా బస్వరాజు గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజల కోసం నిరంతరం పనిచేసిన ఆయన మరణం తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నారాయణ గౌడ్, మురళీధర్ గౌడ్, తూము శ్రీనివాస్ రెడ్డి, సాధిక్, అశోక్ గౌడ్, సత్యనారాయణ, సురేష్ గౌడ్, యాసీన్, వెంకటరాజు, గడ్డం రాములు, యాదయ్య, రమేశ్, కౌన్సిలర్ గడ్డం ప్రేమ్‌కుమార్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.
