మైలవరంలో ఎస్‌ఎస్‌కే విద్యార్థుల క్రీడా ప్రతిభ

అమరావతి ఛాంపియన్‌షిప్‌లో జిల్లా ఎంపికలకు 18 మంది అర్హత

మైలవరం, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అమరావతి ఛాంపియన్‌షిప్–2026లో భాగంగా మైలవరం నియోజకవర్గ స్థాయి పోటీలు లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ పోటీల్లో ఎస్‌ఎస్‌కే స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి జిల్లా జట్టు ఎంపికలకు మొత్తం 18 మంది అర్హత సాధించారు.

అండర్–17 కబడ్డీ విభాగంలో ఇద్దరు బాలురు, ముగ్గురు బాలికలు ఎంపికయ్యారు. అండర్–17 ఖోఖో విభాగంలో ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలు జిల్లా ఎంపికలకు అర్హత పొందారు. అండర్–17 వాలీబాల్ విభాగంలో ఒక బాలుడు, ఇద్దరు బాలికలు ఎంపికయ్యారు.

మైలవరం నియోజకవర్గం తరఫున జిల్లా జట్టు ఎంపికల్లో ఈ 18 మంది విద్యార్థులు ప్రాతినిధ్యం వహించనున్నారు. అమరావతి ఛాంపియన్‌షిప్‌లో జిల్లా స్థాయి ఎంపికలకు అర్హత సాధించిన విద్యార్థులను, అందుకు కారకులైన వ్యాయామ ఉపాధ్యాయులను పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి మోహనరావు, కరస్పాండెంట్ జి. భావన అభినందించారు. క్రీడల్లో మరింత ప్రతిభ కనబర్చి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించింది.