పశువులను మేతకు తీసుకెళ్లి..

ఇంటికి తిరిగి రాని రైతు

కడెం, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబ్‌పేట గ్రామానికి చెందిన రైతు సింధం గంగన్న (70) పశువులను మేతకు తీసుకెళ్లి అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 30న గ్రామ శివారులోని అడవికి పశువుల మేత కోసం వెళ్లిన గంగన్న తిరిగి ఇంటికి రాలేదు. దీంతో శుక్రవారం గ్రామస్తులు అడవిలో విస్తృతంగా గాలించినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు. అదే రోజు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో గంగన్న వాగు ప్రవాహంలో కొట్టుకుపోయారా? లేక అడవిలో దారి తప్పిపోయారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గంగన్న ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీప పోలీసులకు లేదా 97038 33979 నంబర్‌కు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.