విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ..
వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలం కొత్త పల్లి (ఎన్) మండల ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించచారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ,ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా పాఠ్య పుస్తకాలను గురువారం విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
