నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి: సీఐ గడ్డం మల్లేష్

బిక్కనూర్, ఆంధ్రప్రభ: భావితరాల కోసం నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జీడిమెట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ అన్నారు.

మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో సోమవారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో కొనసాగుతున్న ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ కార్యక్రమానికి సీఐ గడ్డం మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బిక్కనూర్ ఎస్‌ఐ ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉప సర్పంచ్ వినోద్ గౌడ్, సీఐ సతీమణి సుశీల, సొసైటీ చైర్మన్ నాగర్తి భూమ్‌రెడ్డి, పాలకేంద్రం అధ్యక్షుడు తక్కల రవీందర్ రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి, టెంపుల్ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి, వార్డు సభ్యులు మద్ది కృష్ణారెడ్డి, భవాని ధర్మస్వామి, గ్రామ కార్యదర్శి శ్యామ్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారి అంజయ్య, హరిత, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.