Protest | డీజిల్ పోసుకొని ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Protest | డీజిల్ పోసుకొని ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Protest | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. ఎంజే మార్కెట్ చౌరస్తాలో భారీగా చేరుకున్న ఆటో డ్రైవర్లు తమ డిమాండ్ల సాధన కోసం నిరసన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నిన్న ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన కొనసాగగా, ఇవాళ ఆటో డ్రైవర్లు కూడా నిరసన బాట పట్టారు. ఆటో మీటర్‌పై ఛార్జీలు పెంచాలని, జిల్లా ఆటోలకు హైదరాబాద్‌లోకి అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఆందోళన మధ్య ఒక ఆటో డ్రైవర్ డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. వెంటనే అక్కడున్న వారు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

గంటకు పైగా కొనసాగుతున్న ఈ ధర్నా కారణంగా ఎంజే మార్కెట్ పరిసరాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply