బాబాపూర్ గ్రామ పంచాయతీ తనిఖీ
పెండింగ్ హౌస్ ట్యాక్స్ వసూళ్లకు చర్యలు తీసుకోవాలి: ఎంపీవో యూసఫ్ ఖాన్
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్ గ్రామ పంచాయతీని మంగళవారం స్థానిక ఇన్చార్జి ఎంపీవో యూసఫ్ ఖాన్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతోష్‌ను వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
మురికి కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం పరిశీలించాలని పంచాయతీ సెక్రటరీకి సూచించారు.
అలాగే పెండింగ్‌లో ఉన్న హౌస్ ట్యాక్స్‌లను వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
