హైదరాబాద్: మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. స్థిరాస్తి వ్యాపారి చక్రధరగౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీశ్ రావుతో పాటు రాధాకిషన్ రావు పై కేసు నమోదు చేశారు. దీంతో ఎఫ్ ఐ ఆర్ వారిద్దరినీ నిందితులుగా చేర్చారు. దీనిపై హరీశ్ రావు కేసు కొట్టివేయాల్సిందిగా హైకోర్టు ను ఆశ్రయించారు.. ఈ కేసులో ఇరువైపుల వాదనలు ఇప్పటికే ముగియగా.. నేడు ఎఫ్ ఐ ఆర్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
High Court | ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట ..
