ఉప్లూర్ లో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్..
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు చలివేంద్రన్నీ గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రయాణికులకు తాగునీటి దాహార్తిని తీర్చేందుకు, గ్రామ సంక్షేమం, సౌకర్యం కోసం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తక్కురి శేఖర్,కార్యదర్శి రాఘవేందర్,వార్డ్ సబ్యలు అనిల్,అజయ్,రాకేష్,సంతోష్ ,సురేష్,అంజిత్,.సీనియర్ నాయకులు సాదుల్లా, కరొబార్ భజేసబ్,లైన్ మెన్ శ్రీకాంత్,ఫీల్డ్ అసిస్టెంట్ అశ్వపతి తదితరులు పాల్గొన్నారు.
