పరీక్షా కేంద్రంలో ఆకస్మిక తనిఖీ ఎందుకు..?

పరీక్షా కేంద్రంలో ఆకస్మిక తనిఖీ ఎందుకు..?

పల్నాడు, ఆంధ్రప్రభ : నరసరావుపేట శంకర భారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజన సింహ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు, ప్రశ్నాపత్రాల పంపిణీ, భద్రతా ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణ విధానాన్ని ఆమె నిశితంగా పరిశీలించారు.

పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.