Ci-Mallayya-Dismissed : ఉద్యోగం పాయె.. Andhra Prabha Crime News
Ci-Mallayya-Dismissed : ఉద్యోగం పాయె.. Andhra Prabha Crime News
- సీఐ చిన మల్లయ్య డిస్మిస్
- మహిళపై లైంగిక దాడి కేసులో పరారీ
- ఏఈపీలో తీవ్ర సంచలనం
( పల్నాడు బ్యూరో , ఆంధ్రప్రభ) :
Ci-Mallayya-Dismissed : సిఐ చిన్న మల్లయ్యని ఉద్యోగం నుంచి తొలగిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వుల నకలు పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి బుధవారం చేరాయి. తన పై సిఐ చిన్న మల్లయ్య బలవంతంగా బలత్కారం చేసాడని ధనలక్ష్మి అనే మహిళ ఏప్రిల్ 29 న ఫిర్యాదు చేసింది… మహిళ ఫిర్యాదుతో సిఐ చిన్నమల్లయ్యపై అత్యాచారం కేసు నమోదు చేసారు. కేసు నమోదైన తర్వాత చిన్న మల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లి హైకోర్టు, సుప్రీంకోర్టు ల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని తన న్యాయవాది ద్వారా కోరగా…. రెండు కోర్టు లు మల్లయ్య బెయిల్ ఫిటిషన్ లు డిస్మిస్ చేసాయి. ఈ నేపథ్యంలో సిఐ చిన్న మల్లయ్య సుమారు నెల రోజులపైగా విధులకు హాజరు కాకపోవడంతో ఉన్నతాధికారులు, ఆయనను శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగిస్తూ… ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పి కార్యాలయానికి డిస్మిస్ అర్డర్ పంపినట్లు సమాచారం
Ci-Mallayya-Dismissed మల్లమ్య మాయం
మహిళపై అత్యాచార ఆరోపణల్లో చిక్కుకుని ,, పోలీసు కేసులో అదృశ్యమైన సీఐ చిన్న మల్లయ్య కోసం పల్నాడు పోలీసులు జల్లెడ పట్టారు. వినుకొండ సీఐ నేతృత్వంలొ మూడు పోలీసు బృందాలు,, పరారీ సీఐ కోసం వేట సాగిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ప్రయోగించి… సీఐ ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ సీఐ చిన్న మల్లయ్య జాడ దొరకటం లేదు. కనీసం సమాచారమూ చిక్కటం లేదు. అసలు ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని సస్పెన్షన్ లో ని సీఐ చిన్నమల్లయ్య దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేయటంతో… ప్రస్తుతం పోలీసుల ఆపరేషన్ మల్లయ్య తెరమీదకు వచ్చింది. నేరారోపణలు తీవ్రతను దృష్టిలో పెట్టుకుంటే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీలు కాదని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ బెయిలిస్తే సిఐ తన హోదాను అడ్డుపెట్టుకొని దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం లేకపోలేదని పేర్కొంది. మరో వైపు సీఐ కుమారుడు తనను ఫోన్ లో బెదిరిస్తున్నాడని బాదిత మహిళ కోర్టు లో ఆందోళన వ్యక్తం చేసింది.
Ci-Mallayya-Dismissed ముందస్తుగానే అదృశ్యం
వీఆర్ లోని చిన్న మల్లయ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డా రంటూ అంటూ…పల్నాడు జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వినుకొండ పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 29న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చిన్న మల్లయ్య హైకోర్టును ఆశ్రయించారు. బాధితురాలి తరపున న్యాయవాది.. అనేక అంశాలను కోర్టుకు విన్నవించారు. అత్యాచార ఆరోపణలు చేస్తున్న మహిళ పిటిషనర్ నుంచి అనేక సార్లు సొమ్ము తీసుకున్నారన్నారు. ఐదేళ్లుగా సీఐకి ఆమె తెలుసన్నారు. పిటిషనర్ కోసం ఆయన కుమారుడిని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ దర్యాప్తు ఏ దశలో ఉంది, నిందితుడిని అరెస్ట్ చేయలేదని సహాయ పీపీ ప్రియాంకను ప్రశ్నించారు. ‘నిందితుడు పరారీలో ఉన్నారు. పోలీసులు వెతుకుతున్నారు. నిందితుడి కుమారుడు బాధితురాలికి మెసేజ్లు పంపి ఎందుకు బెదిరించారు. ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది. నిందితుడికి పటుత్వ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. బెయిలు మంజూరు చేయ వద్దని అసిస్టెంట్ పీపీ కోరారు. ఈ క్రమంలోనే అత్యాచార ఆరోపణల కేసులో నిందితుడిగా ఉన్న చిన్నములయ్యకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
Ci-Mallayya-Dismissed కడకు డిస్మిస్
కోర్టు తీర్పు నే పథ్యంలో చిన్న మల్లయ్య ను అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందాలు వెతుకులాటను ప్రారంభించాయి. ప్రస్తుతం మూడు బృందాలు సీఐ కోసం గాలిస్తున్నాయి. బాధిత మహిళతో రాజీప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనే… సీఐ అదృశ్యం ఓ కొలిక్కి రాలేదని ప్రచారం జరుగుతోంది. ఎన్ని జరిగినా.. సీఐ అరెస్టు ఖాయం.. రిమాండు ఖాయం. అయితే.. ఆయనకు తక్షణమే బెయిల్ అవకాశం లభించే వరకూ.. ఆయన చిక్కడు.. దొరకడు అని పోలీసు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో… అకస్మాత్తుగా ఉన్నతాధికారులు తాజా గా డిస్మిస్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
