Telangana | ఆటోను ఢీ కొట్టిన ఇసుక ట్రాక్టర్

Telangana | ఆటోను ఢీ కొట్టిన ఇసుక ట్రాక్టర్

న‌లుగురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
ఆబులెన్స్ ద్వారా ఖమ్మం ఆసుపత్రికి తరలింపు


Telangana | మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా (Mahabubabad district), శనగపురం శివారులోని కుమ్మరికుంట్ల తండ వద్ద శుకృవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుండి నేరెడ గ్రామానికి వెళుతున్న ఆటో (Auto)ను ఇసుక ట్రాక్టర్ (Tractor) ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్ పచ్చిపాల మల్లేష్, ఆటోలో నేరెడ కస్తూర్బా స్కూల్ కు వెళుతున్న ఉపాధ్యాయురాళ్ళు మద్దెల సింధూజా, బానోత్ కళావతి, సంపల్లి స్వరూప, వెలుపుకొండ శైలజ, కుంటిగొర్ల రాధలకు తీవ్రగాయాలయ్యాయి.

కాగా వీరందరినీ హుటాహుటిన మహబూబాబాద్ (Mahabubabad) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్సనందిస్తున్నారు. అయితే కుంటిగొర్ల రాధ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించడంతో బంధువులు ఆమెను ఆబులెన్స్ ద్వారా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply