Telangana | సహకార వారోత్సవాలు

Telangana | సహకార వారోత్సవాలు

Telangana | కడెం, ఆంధ్రప్రభ : సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని నిర్మల్ జిల్లా (Nirmal District) కడెం మండలం పాండవపూర్ పీఏసీఎస్ చైర్మన్ రామడుగు శైలజ రమేష్ రావు అన్నారు. శుక్రవారం కడెంలోని పాండవపూర్ పీఏసీఎస్ సొసైటీ ఆవరణంలో సహకార వారోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సహకార జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… రైతులకు (farmers) కావలసిన ఎరువులు, విత్తనాలు సొసైటీ (societie) ద్వారా సకాలంలో అందించడం జరుగుతుందన్నారు. రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కడెం ఏడీసీసీ బ్యాంక్ మేనేజర్ ఏస్ రాజేశ్వరరావు, సొసైటీ సీఈఓ కసుల రాజేందర్, పీఏసీఎస్ డైరెక్టర్ కర్ణాటక రాజన్న, సంతపురి సుగుణ పోశం కార్యదర్శి రాజం, సిబ్బంది రఘు, రాజేందర్, సాయి, రైతులు పాల్గొన్నారు.