Rythu Bharosa | నేటి నుంచే రైతు భరోసా నిధుల జమ..
Rythu Bharosa | నేటి నుంచే రైతు భరోసా నిధుల జమ..
తొలి విడతలో 41.37 లక్షల మంది రైతులకు లబ్ధి
Rythu Bharosa | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం వర్షాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను మంగళవారం విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులను జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తొలి విడతలో రెండు ఎకరాల వరకు సాగుభూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. అనంతరం మిగిలిన రైతులకు కూడా దశలవారీగా నిధులను విడుదల చేయనున్నారు.
ఖరీఫ్ సాగు పనులు ఊపందుకున్న నేపథ్యంలో రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంటోంది. రైతులు విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం ఈ నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు పారదర్శకంగా అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఖాతాల్లో నిధుల జమ ప్రక్రియను దశలవారీగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
