Rs.77.7 lakhs | హైదరాబాద్ బిజినెస్‌మ్యాన్‌కు దొంగలు ఇచ్చిన షాక్!

Rs.77.7 lakhs | హైదరాబాద్ బిజినెస్‌మ్యాన్‌కు దొంగలు ఇచ్చిన షాక్!

Rs.77.7 lakhs | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్ : ఓటీపీలు అడగడం పాత పద్ధతి.. వాట్సాప్‌లో లింకులు పంపడం నిన్నటి ట్రెండ్.. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఏకంగా మీ ఇంటికే ‘ఉచితంగా’ సరికొత్త స్మార్ట్‌ఫోన్ పార్శిల్ పంపిస్తున్నారు. వినడానికి షాకింగ్‌గా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం. హైదరాబాద్ మాదాపూర్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఈ సరికొత్త హైటెక్ మోసానికి బలై ఏకంగా రూ. 77.7 లక్షలు పోగొట్టుకున్నాడు.

Rs.77.7 lakhs | అసలేం జరిగిందంటే..

ముందుగా ఓ వ్యక్తి బాధితుడి ఇంటికి బ్యాంక్‌ నుంచి కాల్‌ చేస్తున్నట్లు మాట్లాడి.. పరిచయం చేసుకున్నాడు. రూ. 50లక్షల లిమిట్‌తో క్రెడిట్‌ కార్డు మంజూరైందని నమ్మించి, కార్డు యాక్టివేషన్‌కు కొత్త సిమ్‌ అవసరం అని చెప్పడంతో బాధితుడు కొత్త సిమ్‌ తీసుకున్నాడు. అక్కడితో ఆగకుండా బ్యాంక్ స్టికర్‌ తో బాధితుడి ఇంటికి కొరియర్ ద్వారా ఒక సరికొత్త మొబైల్ ఫోన్ పార్శిల్ పంపిచారు. బ్యాంకు ప్రీమియం క్రెడిట్ కార్డ్ డివిజన్ నుంచి గిఫ్ట్‌గా వచ్చిందని నమ్మించారు. అలాగే టెలికాం శాఖ వెరిఫికేషన్ కోసం మీ ఈ-సిమ్ (e-SIM)ను ఫిజికల్ సిమ్‌గా మార్చాలని, దాన్ని ఈ కొత్త ఫోన్‌లో వేసి కాసేపు వాడాలని నమ్మబలికారు.

Rs.77.7 lakhs |
Rs.77.7 lakhs |

నేరగాళ్లు పంపిన ఆ ఫోన్‌లో ముందే ఒక ప్రమాదకరమైన ‘యాప్’ (SMS ఫార్వార్డింగ్ యాప్) ఇన్‌స్టాల్ చేసి ఉంది. బాధితుడు తన సిమ్ కార్డును ఆ ఫోన్‌లో వేయడమే ఆలస్యం.. ఆ యాప్ యాక్టివేట్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి బాధితుడి ఫోన్‌కు వచ్చే బ్యాంక్ ఓటీపీలు (OTPs), అలర్ట్‌లు ఏవీ అతనికి కనిపించలేదు. అవన్నీ నేరుగా సైబర్ దొంగల మొబైల్స్‌కు ఫార్వర్డ్ అయిపోయాయి. ఇంకేముంది.. బాధితుడికి తెలియకుండానే అతని అకౌంట్ల నుంచి ఏకంగా రూ. 77 లక్షలకు పైగా డబ్బును దొంగలు ఊడ్చేశారు.

Rs.77.7 lakhs | రంగంలోకి దిగిన పోలీసులు..

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుల గుట్టు రట్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో దాక్కున్న సలీం మొండల్, అబ్దుల్ అలీమ్, హషీమ్ రెజా, మిజానుర్ రెహమాన్, బన్సీధర్, మెహబూబ్ ఆలం ఆరుగురు మోసగాళ్లను పట్టుకుని హైదరాబాద్ తరలించారు. వారి వద్ద నుంచి రూ. 15 లక్షల నగదు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల హెచ్చరికలు..

మీ ప్రమేయం లేకుండా ఇంటికి వచ్చే ఏ ఉచిత గిఫ్ట్‌లు లేదా మొబైల్ ఫోన్లను నమ్మి స్వీకరించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల మాటలు నమ్మి మీ ఈ-సిమ్ (e-SIM) లేదా ఫిజికల్ సిమ్ కార్డులను వేరే కొత్త డివైజ్‌లలో వాడకూడదన్నారు. బ్యాంకు అధికారులు ఎప్పుడూ ఇలాంటి గిఫ్ట్‌లు పంపరని, అనుమానం వస్తే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

CLICK HERE TO READ MORE : incident | స్విమ్మింగ్ పూల్‌లో పడి…

CLICK HERE TO READ MORE