ఊట్కూర్‌కు ముంపు ముప్పు..

ఊట్కూర్‌కు ముంపు ముప్పు..
- పునరావాసం కల్పించాలని అఖిలపక్షం వినతి
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లాలోని మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పథకంలో భాగంగా ఊట్కూర్ పెద్ద చెరువు రిజర్వాయర్ గా మారుస్తున్న నేపథ్యంలో చెరువు విస్తరణతో గ్రామానికిముంపుపొంచిఉందని ఊట్కూర్ ప్రభావిత ప్రాంతాన్ని గుర్తించి పునరావాసం కల్పించాలని నారాయణపేట రెవెన్యూఅదనపుకలెక్టర్ శ్రీనుకు సోమవారం ప్రజావాణిలో ఊట్కూర్ అఖిలపక్షం నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు.
జీవో 69 మక్తల్- నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఊట్కూర్ పెద్ద చెరువు సామర్థ్యాన్ని 800 ఎకరాల నుంచి 19000 వేల ఎకరాలకు పెంచే ప్రతిపాదనపై ఊట్కూర్ గ్రామ అఖిలపక్ష కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రాజెక్టువల్ల గ్రామానికి ఊటనీటిముప్పు మరింత పెరిగి వందలాది ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, దేవాలయాలు, మసీదులు, స్మశానవాటికలు ప్రమాదాలకు గురికానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఊట్కూర్ మండల కేంద్రంలోని చెరువు సమీపంలో ఉన్న కాలనీలలో కొద్దిపాటి వర్షాలకు పిల్ల పునాదుల నుండి ఊటనీరు ఊబికి వస్తుందని ప్రాజెక్టు నిర్మాణం చేపడితే చెరువులో నీటి సామర్థ్యం పెరిగి ఊట ప్రభావం మరింత పెరగడంతోపాటు గ్రామం సగభాగం జలమయమయ్యే ప్రమాదంఉందన్నారు.
చెరువులో నిరంతరం భారీగా నీరు నిల్వ ఉండడం వల్ల ఊటనీటి ప్రభావం వంద రెట్లు పెరిగే అవకాశం ఉందని, దీంతో గ్రామ ప్రజల ప్రాణాలు, ఆస్తులు, జీవనోపాధి ప్రమాదంలో పడతాయని కమిటీ సభ్యులు వినతి పత్రంలో ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు చుట్టుపక్కల ఉన్న వందల ఎకరాల సాగుభూములు చిత్తడిగా మారి పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్, సామాజిక–పర్యావరణ ప్రభావ నివేదికలను ప్రజలకు వెల్లడించకపోవడం, గ్రామసభలు నిర్వహించకపోవడం వంటి పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
భూసేకరణ పునరావాస చట్టం–2013 ప్రకారం ప్రభావిత ప్రాంతాలను ముందుగానే సర్వే చేసి గుర్తించాలని, బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయి ఆర్ అండ్ ఆర్ పునరావాస కాలనీ ఏర్పాటు చేసి ఉచిత ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు, గరిష్ట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఊటనీటి నివారణకు చెరువు కట్ట వద్ద సీపేజ్ కటాఫ్ వాల్, టో డ్రెయిన్ నిర్మాణాన్ని ప్రభుత్వ ఖర్చుతో యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై స్పష్టమైన సాంకేతిక హామీ పునరావాస భరోసా ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేస్తున్నట్లుపేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు రమేష్, భరత్, ఇబాదూర్ రెహమాన్, ఆనంద్ రెడ్డి, భరత్ కుమార్, ప్రకాష్, సమీ, అమీర్ తదితరులు పాల్గొన్నారు.
