official statement | ఆ వార్తల్లో నిజం లేదు!
official statement | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇండియన్ క్రికెటర్, మన తెలుగబ్బాయి తిలక్ వర్మ, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల డేటింగ్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఊహాగానాలను పూర్తిగా ఖండిస్తూ నటి శ్రీలీల పీఆర్ టీమ్ తాజాగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

గత రెండు రోజులుగా నటి శ్రీలీల, యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ మధ్య రిలేషన్ నడుస్తోందంటూ సోషల్ మీడియా కోడైకూస్తోంది. గతంలో వీరిద్దరూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, అలాగే తిలక్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలీల కనిపించడంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వైరల్ గా మారాయి. ఈ వార్తలు తెగ చక్కర్లు కొట్టడంతో శ్రీలీల టీమ్ దీనిపై గట్టిగా స్పందించింది.
“సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. తిలక్ వర్మ, శ్రీలీల విషయంలో వినిపిస్తోన్న రూమర్స్ అన్నీ పూర్తిగా నిరాధారమైనవి . వారిద్దరి మధ్య ఎలాంటి పరిచయం లేదు, పైగా ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ఈ ఊహాగానాలలో ఎంతమాత్రం వాస్తవం లేదు. దయచేసి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి కల్పిత కథనాలను ప్రచారం చేయవద్దు” అని శ్రీలీల టీమ్ స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో గత కొన్ని రోజులుగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న గాసిప్స్‌కు ఒక్కసారిగా బ్రేక్ పడినట్లయింది.
